Yatra film completed one week of its run. The latest we hear is that the film has made a total share of 7.6 crores to date worldwide after the first week.
#Yatra
#FirstWeekWorldwideCollections
#1stdaycollections
#Y.S.Rbiopic
#Y.S.RajasekharaReddy
#mahivraghav
#ysjagan
#tollywood

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' చిత్రం గురువారంతో బాక్సాఫీసు విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ బయోపిక్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తొలివారం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి 50% శాతానికి పైగా రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం 'లవర్స్ డే', 'దేవ్' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండటం... పెద్ద సినిమాలేవీ బరిలో లేక పోవడంతో సెకండ్ వీక్ కూడా కలెక్షన్ల పరంగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వారం రూ. 7.6 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోల్చితే ఇది మంచి మొత్తమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ చిత్రం రైట్స్ వరల్డ్ వైడ్ రూ. 13 కోట్లకు అమ్మారు. మరొక 6.5 కోట్లు వసూలైతే లాభాల బాటలోకి వెళ్లనుంది. సినిమా పుల్ రన్‌లో అది సాధ్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
‘యాత్ర'లో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడం గమనార్హం. మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రకు జీవం పోశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలను పోకస్ చేస్తూ 'యాత్ర' చిత్రం తెరకెక్కింది. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు.